ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Bengal: 7 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి

ABN, First Publish Date - 2021-09-08T17:36:30+05:30

ఏడు దేశాల నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి వచ్చే విమాన ప్రయాణికులు కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ఏడు దేశాల నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి వచ్చే విమాన ప్రయాణికులు కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఒక్క మంగళవారం 601 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో బుధవారం నుంచి 7 దేశాల నుంచి బెంగాల్ కు వచ్చే ప్రయాణికులు బుధవారం నుంచి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. బంగ్లాదేశ్, చైనా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, మారిషస్, జింబాబ్వే, బోట్స్వానా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారి చెప్పారు. 


యునైటెడ్ కింగ్ డమ్, బ్రెజిల్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇప్పటికే ఈ నియమం అమలులో ఉంది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎవరైనా ప్రయాణీకులు ఉచితంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలనుకుంటే, వారు కోల్ కతా నగరంలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు పంపుతామని అధికారులు తెలిపారు. బెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా ఏడుగురు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 18,522కు పెరిగింది. 


Updated Date - 2021-09-08T17:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising