ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19పై సమీక్షకు మమత ఆదేశం

ABN, First Publish Date - 2021-12-29T21:01:36+05:30

పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్-19 మహమ్మారిపై సమీక్షించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్-19 మహమ్మారిపై సమీక్షించాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం అధికారులను ఆదేశించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న చోట్ల కట్టడి ప్రాంతాలుగా గుర్తించాలని తెలిపారు. ఈ మహమ్మారి మూడో ప్రభంజనం రాబోతోందనే హెచ్చరికల నడుమ ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు. 


పరిస్థితులనుబట్టి అవసరమైతే పాఠశాలలను, కళాశాలలను కొంత కాలంపాటు మూసివేయవచ్చునని చెప్పారు. అదే విధంగా 50 శాతం మంది ఉద్యోగుల హాజరుతో కార్యాలయాలను నిర్వహించాలని కూడా కోరవచ్చునని చెప్పారు. 


కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని, కొన్ని ఒమైక్రాన్ కేసులు కూడా నమోదయ్యాయని మమత బెనర్జీ చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, స్థానిక రైలు సర్వీసులపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 


గంగా సాగర్ మేళా ఏర్పాట్లపై సమీక్షించేందుకు మమత బెనర్జీ బుధవారం సాగర్ దీవిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 


Updated Date - 2021-12-29T21:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising