ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమబెంగాల్ ఎన్నికలపై ఈసీ నేడు కీలక ప్రకటన

ABN, First Publish Date - 2021-01-22T14:58:06+05:30

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కీలక ప్రకటన చేయనుంది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కీలక ప్రకటన చేయనుంది.  కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయ, హోంశాఖ కార్యదర్శి హెచ్ కే ద్వివేది, డీజీపీ వీరేంద్ర, ఇతర ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు విలేకరుల సమావేశం నిర్వహించనుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పెండింగులో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేయాలని, పోలింగ్ తేదీల ప్రకటనకు ముందు హింసాకాండ చేలరేగకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. 


పశ్చిమబెంగాల్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని, అవసరమైన దానికంటే 25 శాతం ఎక్కువమంది భద్రతా సిబ్బందిని నియమించాలని ఈసీ ఆదేశించింది. ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతపై ఈసీ రాష్ట్ర పోలీసు ఏడీజీ జ్ఞావంత్ సింగ్‌తో సమావేశం నిర్వహించి అసంతృప్తి వ్యక్తం చేసింది. నేరస్థుల జాబితాను పోలీసులు ఈసీకి సమర్పించారు.బెంగాల్ ఎన్నికల సందర్భంగా ఎయిర్ అంబులెన్సులు, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది.

Updated Date - 2021-01-22T14:58:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising