ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్, రష్యా, బంగ్లాదేశ్‌లలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు!

ABN, First Publish Date - 2021-07-10T16:28:11+05:30

బ్రిటన్, రష్యా, బంగ్లాదేశ్‌లలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య గతంతో పోల్చుకుంటే తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా సెకెండ్ వేవ్ ఇంకా మన మధ్య నుంచి పోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రజలను హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ బ్రిటన్, రష్యా, బంగ్లాదేశ్‌లలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపధ్యంలో మనమంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తిరిగి ఆంక్షలు విధించారన్నారు. 


మన దేశంలో రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయిని తెలిపారు. గడచిన వారంలో రోజు వారీ సగటు కేసులు ఎనిమిది శాతానికి పడిపోయాయన్నారు. ప్రస్తుతం దేశంలోని 90 జిల్లాల్లో 80 శాతం కేసులు ఉన్నాయని లవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే కరోనా రికవరీ రేటు 97.2 శాతంగా ఉందన్నారు. కాగా పర్యాటక ప్రాంతాలకు అత్యధికంగా జనం వస్తున్నారని, దీంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళలో అత్యధికంగా కరోనా కేసులు ఉన్నాయన్నారు.

Updated Date - 2021-07-10T16:28:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising