ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షమీకి అండగా రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2021-10-26T02:15:30+05:30

ఈ ట్రోలింగును ఇప్పటికే ఖండించిన పలువురు మాజీ క్రికెటర్లు షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కూడా షమీకి మద్దతు ప్రకటించారు. ‘మేమంతా నీతోనే ఉన్నాము’ అంటూ షమీకి భరోసా కల్పించారు. ఈ విషయమై సోమవారం ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత పేసర్ మహమ్మద్ షమీపై ఆన్‌లైన్‌లో దాడి మొదలైంది. షమీ బౌలింగ్ దారుణంగా ఉందని, అతడిచ్చిన పరుగుల వల్లే భారత జట్టు ఓటమి పాలైందని అభిమానులు విరుచుకుపడ్డారు. భారత జట్టులోనూ ఓ పాకిస్థానీ ఉన్నాడని, షమీ వెంటనే ఆ దేశానికి వెళ్లిపోవాలంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. 


ఈ ట్రోలింగును ఇప్పటికే ఖండించిన పలువురు మాజీ క్రికెటర్లు షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కూడా షమీకి మద్దతు ప్రకటించారు. ‘మేమంతా నీతోనే ఉన్నాము’ అంటూ షమీకి భరోసా కల్పించారు. ఈ విషయమై సోమవారం ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘మహ్మద్ షమీ.. మేమంతా నీతోనే ఉన్నాము. వాళ్లంతా విధ్వేషంతో నిండిపోయి ఉన్నారు. ప్రేమ అనేది తెలియదు. వాళ్లని క్షమించు’’ అంటూ ట్వీట్ చేశారు. విధ్వేషంతో నిండిన మనస్తత్వాలని బీజేపీని ఉద్దేశించే రాహుల్ అన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Updated Date - 2021-10-26T02:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising