ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా విషయంలో భారత్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం: చైనా

ABN, First Publish Date - 2021-04-22T23:46:22+05:30

భారత్‌లో రెండో దశ కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు అవసరమైన సాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: భారత్‌లో రెండో దశ కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా పేర్కొంది. భారత్‌లో కరోనా మరోమారు విజృంభిస్తుండడంపై చైనా మీడియా అడిగిన ప్రశ్నకు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ పై విధంగా సమాధానం ఇచ్చారు. 


మానవాళికి కరోనా మహమ్మారి అందరికీ శత్రువుగా మారిందని వెన్‌బిన్ అన్నారు. దీనిపై పోరాడేందుకు అంతర్జాతీయ సమాజం ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో మహమ్మారి కారణంగా పరిస్థితి దారుణంగా ఉందని, వైరస్ నివారణ, వైద్య సామగ్రికి అక్కడ తాత్కాలికంగా కొరత ఉందని అన్నారు. అవసరమైన సాయం, మద్దతు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఫలితంగా వారు (ఇండియా) మహమ్మరిని అదుపులో పెట్టగలుగుతుందని వెన్‌బిన్ వివరించారు. అయితే, చైనా ఈ విషయాన్ని భారత్‌తో అధికారికంగా చర్చించినదీ, లేనిదీ తెలియరాలేదు.   

Updated Date - 2021-04-22T23:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising