ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజ్రీవాల్ వాగ్దానాలన్నీ నెరవేర్చాం: పంజాబ్ సీఎం చన్నీ

ABN, First Publish Date - 2021-11-25T02:35:12+05:30

సీఎం చన్నీని కాపీక్యాట్ అంటూ ఆప్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కేజ్రీవాల్ విధానాల్ని కాపీ చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. దీనిపై చన్నీ స్పందిస్తూ ‘‘పంజాబ్‌లో సాధారణ వ్యక్తి ఎవరో కేజ్రీవాల్‌కు ఎలా తెలుస్తుంది? నన్ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న వాగ్దానాల్ని తాము ఎప్పుడో అమలు చేశామని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు. కేజ్రీవాల్‌కు పంజాబ్‌లో కామన్ మ్యాన్ అంటే ఎవరో తెలియదని, తనను ‘ఫేక్ ఆమ్ ఆద్మీ’ అనడం అవివేకమని విమర్శించారు. సీఎం చన్నీని ‘ఫేక్ కేజ్రీవాల్’ అంటూ పంజాబ్‌లో పొస్టర్లు వెలిశాయి. దీనిపై ఆయన స్పందిస్తూ పై విధంగా సమాధానం ఇచ్చారు.


సీఎం చన్నీని కాపీక్యాట్ అంటూ ఆప్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కేజ్రీవాల్ విధానాల్ని కాపీ చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. దీనిపై చన్నీ స్పందిస్తూ ‘‘పంజాబ్‌లో సాధారణ వ్యక్తి ఎవరో కేజ్రీవాల్‌కు ఎలా తెలుస్తుంది? నన్ను ‘ఫేక్ ఆమ్ ఆద్మీ’ అని తప్పుడుగా వ్యాఖ్యానించి ఇప్పుడు రియలైజై ఉంటారు. మళ్లీ ఇప్పుడు నన్ను ఫేక్ కేజ్రీవాల్ అంటున్నారు. నిజానికి ఇప్పుడు కేజ్రీవాల్ ఇస్తున్న హామీలను మేము ఎప్పుడో నెరవేర్చాం. అంతా అయిపోయాక ఆయన ఇప్పుడు హామీలు ఇస్తున్నారు’’ అని అన్నారు.


ఇక మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సిగ్, బీజేపతో చేతులు కలపడంపై చన్నీ స్పందిస్తూ ‘‘కెప్లెన్ అమరీందర్ కనుక నిజంగానే బీజేపీతో చేతులు కలిపితే మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆయన ఒంటరిగా పోటీ చేసినా బీజేపీతో కలిసినా ప్రతిపక్ష ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ లాభపడుతుంది’’ అని అన్నారు.

Updated Date - 2021-11-25T02:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising