ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీతో కలిసి ఎన్నికల గోదాలోకి దిగుతాం : రాందాస్ అథవాలే

ABN, First Publish Date - 2021-02-28T00:16:25+05:30

పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీతో తాము పొత్తు పెట్టుకుంటామని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అథవాలే ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీతో తాము పొత్తు పెట్టుకుంటామని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అథవాలే ప్రకటించారు. పుదుచ్చేరితో పాటు రాబోయే యూపీ ఎన్నికల్లోనూ పొత్తుకు సిద్ధమని తెలిపారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగితో ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్లు ఆయన వెల్లడించారు. తమకు బీజేపీ ఓ పది సీట్లను ఇచ్చినట్లయితే బీఎస్పీకి ఝలక్ ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ గనక తమకు సీట్లను కేటాయించకపోతే.. తామే గోదాలోకి దిగుతామని, అయితే బీజేపీకి మాత్రం తమ మద్దతు ఉంటుందన్నారు. బెంగాల్‌లో 36 శాతం దళిత ఓటర్లు ఉన్నారని, బీజేపీ తమతో కలిసి వస్తే వారికే లాభమని పేర్కొన్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విషయంలో అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ స్వతంత్ర వ్యక్తి అని, తమ పార్టీలోకి వస్తే కచ్చితంగా సముచిత స్థానం కలిపిస్తామని అథవాలే ప్రకటించారు. 


Updated Date - 2021-02-28T00:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising