ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబన్లు వచ్చి చంపే క్షణం కోసం ఎదురు చూస్తున్నా.. అంతకన్నా ఏం చేయాలి?.. మహిళా మేయర్ ఆవేదన

ABN, First Publish Date - 2021-08-17T19:47:19+05:30

‘‘నేనిక్కడ ఇలా కూర్చొని తాలిబన్ల కోసం ఎదురు చూస్తున్నా. నాకు, నా కుటుంబానికి సహాయం చేసే వాళ్లెవరూ లేరు. భర్త, పిల్లలతో కలిసి కూర్చొని ఉన్నా. నాలాంటి వారిని వెదుక్కుంటూ వచ్చే తాలిబన్లు మమ్మల్ని చంపేస్తారు’’..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: ‘‘నేనిక్కడ ఇలా కూర్చొని తాలిబన్ల కోసం ఎదురు చూస్తున్నా. నాకు, నా కుటుంబానికి సహాయం చేసే వాళ్లెవరూ లేరు. భర్త, పిల్లలతో కలిసి కూర్చొని ఉన్నా. నాలాంటి వారిని వెదుక్కుంటూ వచ్చే తాలిబన్లు మమ్మల్ని చంపేస్తారు’’.. ఈ మాటలు అంటున్నది ఎవరో తెలుసా? అఫ్ఘానిస్తాన్‌లో తొలి మహిళా మేయర్‌గా ఎన్నికైన యువనేత జరీఫా ఘఫారీ. అఫ్ఘాన్‌లో అత్యంత చిన్నవయసులో మేయర్ అయిన ఈమె.. కొన్ని వారాల క్రితం ఒక అంతర్జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో భవిష్యత్తు బాగుండే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తంచేసింది. కానీ ఆమె కలలన్నీ ఆదివారం నాడు ముక్కలైపోయాయి.


అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రభుత్వంలోని సీనియర్ నేతలంతా విదేశాలకు పారిపోయిన వేళ్ల.. జరీఫా మాత్రం అఫ్ఘాన్‌లో తన ఇంట్లోనే ఉండిపోయింది. ‘‘ఎక్కడికి వెళ్లాలి?’’ ఇదే ఆమె ప్రశ్న. దేశంలోని మైదాన్ వార్దాక్ ప్రావిన్స్‌లో మేయర్ అయిన ఆమెకు గతంలో చాలాసార్లు తాలిబన్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆమెపై చాలా సార్లు హత్యాప్రయత్నాలు కూడా జరిగాయి. గతేడాది ఆమెను మూడోసారి చంపడానికి చేసిన ప్రయత్నం విఫలం అవడంతో.. 20 రోజుల తర్వాత నవంబరు 15న జరాఫీ తండ్రి జనరల్ అబ్దుల్ వాసీ ఘఫారీని మిలిటెంట్లు కాల్చిచంపారు. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో తన చావు కోసం ఎదురుచూస్తున్నానని జరాఫీ అంటున్నారు.

Updated Date - 2021-08-17T19:47:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising