ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగమంచు దెబ్బకు చైనా రాజధాని ఉక్కిరిబిక్కిరి...

ABN, First Publish Date - 2021-11-06T22:22:44+05:30

పొగమంచు కోరల్లో చిక్కుకుని చైనా విలవిల్లాడుతోంది. దాని దెబ్బకు పరిశ్రమలు, పలు హైవేలు, స్కూళ్లు మూతపడ్డాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: పొగమంచు కోరల్లో చిక్కుకుని చైనా విలవిల్లాడుతోంది. దాని దెబ్బకు పరిశ్రమలు, పలు హైవేలు, స్కూళ్లు మూతపడ్డాయి. నిర్మాణరంగ కార్యకలాపాలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున కురుస్తున్న పొగమంచు రాజధాని బీజింగ్‌లో దృశ్య స్పష్టతను 200 మీటర్లకు పరిమితం చేసింది. ఈ వింటర్‌లో తొలిసారి చైనా ప్రభుత్వం గురువారం కాలుష్య హెచ్చరికలు జారీ చేసింది.


బిల్డింగుల పైభాగాలు కూడా కనబడనంతగా కురుస్తోంది. పరిశ్రమలకు నెలవైన బీజింగ్-తియాంజిన్-హెబేయి ప్రాంతంలో శీతాకాలంలో  దట్టమైన పొగమంచు కురవడం, మరీ ముఖ్యంగా గాలి లేకుండా అలా నిశ్చలంగా కురుస్తూ ఉండడంతో జనం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. 


ఈ వారాంతంలో సైబీరియా మీదుగా గాలులు వీస్తాయని, అప్పుడు కాలుష్యం కొంత మాయమవుతుందని భావిస్తున్నారు. ఈ శీతాకాలంలో ప్రధాన నగరాల్లో పీఎం 2.5గా పిలిచే ప్రమాదకర, గాలి కణాల సాంద్రతను ఏడాదికి సగటున 4 శాతానికి తగ్గించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ గత నెలలో తెలిపింది.


బీజింగ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకారం శుక్రవారం చైనాలోని పట్టణ ప్రాంతంలోని పీఎం 2.5 స్థాయులు క్యూబిక్ మీటర్‌కు అత్యధికంగా 234 మైక్రోగ్రాములకు చేరుకున్నాయి. రాజధాని బీజింగ్, దానిని సమీప నగరమైన ఝంజ్జియాకౌ‌లలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 4-20 మధ్య వింటర్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో తాజా కాలుష్యం ఆందోళన రేకెత్తిస్తోంది.  

Updated Date - 2021-11-06T22:22:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising