ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌పై అసెంబ్లీ అధికారుల వర్చువల్ సమావేశం ఈ నెల 19న

ABN, First Publish Date - 2021-04-15T22:54:55+05:30

దేశంలోని చట్ట సభల ప్రిసైడింగ్ అధికారుల వర్చువల్ సమావేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలోని చట్ట సభల ప్రిసైడింగ్ అధికారుల వర్చువల్ సమావేశం ఈ నెల 19న జరుగుతుంది. ఈ సమావేశానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహిస్తారు. కోవిడ్-19 మహమ్మారిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. 


దేశంలో ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితి, ప్రజా ప్రతినిధుల బాధ్యత, పోషించవలసిన పాత్రల గురించి ఈ సమావేశంలో చర్చిస్తారని గురువారం విడుదలైన ఓ అధికార ప్రకటన వెల్లడించింది. రాష్ట్రాల శాసన సభల ప్రిసైడింగ్ అధికారులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, చీఫ్ విప్‌లు, రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు పాల్గొంటారని తెలిపింది. 


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం  వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల్లో 2,00,739 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒక రోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం మన దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,40,74,564. వీటిలో యాక్టివ్ కేసులు 14,71,877.


Updated Date - 2021-04-15T22:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising