ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎమ్మెల్యే అన్న ఏకైక గౌరవంతో వదిలిపెడుతున్నాం...ఎన్నికల్లో చూసుకుంటాం’

ABN, First Publish Date - 2021-05-20T22:09:23+05:30

కరోనా సెకండ్ వేవ్ కాస్తలో కాస్త తగ్గుముఖం పట్టిందన్న వార్తల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ కాస్తలో కాస్త తగ్గుముఖం పట్టిందన్న వార్తల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు అడిగత తెలుసుకుంటున్నారు. ఇలా తెలుసుకుంటున్న సమయంలో వారికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఎదురైంది. దేశరాజ్ కర్నావాలా... ఉత్తరాఖండ్‌లోని ఝబ్రేబా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గంలోని ఓ ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడానికి వచ్చారు. ఆయన్ను చూసిన గ్రామస్థులు ఆయన్ను అడ్డుకున్నారు. అంతేకాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను తమ గ్రామంలోకి అనుమతించమని తేల్చి చెప్పారు. తమ గ్రామాన్ని ఎమ్మెల్యే తీవ్ర నిర్లక్ష్యం చేశారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు ఎమ్మెల్యే అన్న ఏకైక గౌరవంతో వదిలిపెడుతున్నాం. మీ పదవికి గౌరవం ఇస్తున్నాం. ఎన్నికల సమయంలో మా దగ్గరికి వస్తారు కదా... అప్పుడు దెబ్బలతో సిద్ధంగా ఉంటాం’’ అంటూ హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని జాగరూకత చేయాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అందులో భాగంగానే ఓ ఊరికి వచ్చారు. దీంతో ప్రజలు ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తమ గ్రామానికి ఏమీ చేయలేదని, పట్టించుకోలేదని ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. 

Updated Date - 2021-05-20T22:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising