ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘాన్‌లో షాకింగ్ దృశ్యం: విమానం ఎక్కేందుకు ప్రజలు పరుగో పరుగు..!

ABN, First Publish Date - 2021-08-16T17:28:33+05:30

20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించారు. ఒకటొకటిగా అఫ్ఘానిస్తాన్‌లోని కీలక పట్టణాలన్నింటినీ ఆక్రమించుకుంటూ వచ్చి కాబూల్‌ను సైతం హస్తగతం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: 20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించారు. ఒకటొకటిగా అఫ్ఘానిస్తాన్‌లోని కీలక పట్టణాలన్నింటినీ ఆక్రమించుకుంటూ వచ్చి కాబూల్‌ను సైతం హస్తగతం చేసుకున్నారు. ఈ నగరం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ ఉగ్రవాదుల అదుపాజ్ఞల్లోకి వెళ్లిపోయాయి. ఒక్క కాబూల్ విమానాశ్రమం మాత్రమే అమెరికా సైన్యం ఆధీనంలో ఉంది. దీంతో అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు అఫ్ఘానీయులు సిద్ధమయ్యారు. ప్రజలందరూ విమానాశ్రయానికి చేరుకొని, అక్కడ ఉన్న ఒక విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో నమ్మశక్యం కాని దృశ్యాలు కనిపించాయి.


ఏ సునామీనో భూకంపమో వస్తే పరుగులు తీసినట్లు.. విమానం ఎక్కేందుకు ప్రజలు ఎగబడ్డారు. విమానంలోకి వెళ్లేందుకు వేసిన ఒక మెట్ల నిచ్చెనపై చీమలదండులా వేలాడుతూ కనిపించారు. కాస్త సందు కనపడితే చాలు.. విమానంలోకి దూరేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు అఫ్ఘాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అద్దంపడుతున్నాయని కొందరు అభిపప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో గుంపులుగా ఎగబడుతున్న ప్రజలను అదుపుచేయడం కోసం విమానాశ్రయానికి కాపలాగా నిలబడిన అమెరికా దళాలు.. పలుమార్లు గాల్లో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.





Updated Date - 2021-08-16T17:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising