ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీవీ రామన్ కృషి వల్లే ఈ నాటి విజ్ఞానం: ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2021-02-28T22:14:39+05:30

జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మనుషుల ప్రగతికి విజ్ఞాన శాస్త్రమే మూలాధారమని, భారతీయ నవ్య విజ్ఞాన శాస్త్ర ప్రగతికి సర్ సీవీ రామన్ చేసిన కృషి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మనుషుల ప్రగతికి విజ్ఞాన శాస్త్రమే మూలాధారమని, భారతీయ నవ్య విజ్ఞాన శాస్త్ర ప్రగతికి సర్ సీవీ రామన్ చేసిన కృషి చిరస్మరణీయం అని అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో ఆదివారం వరుస ట్వీట్స్ చేశారు. ‘మానవ ప్రగతికి విజ్ఞాన శాస్త్రం మూలాధారం. జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా శాంతి, అభివృద్ధి మార్గంలో ప్రపంచ ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా, ఆనందంగా తీర్చిదిద్దే దిశగా పరిశోధకులు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా వైజ్ఞానిక సమాజం, ఔత్సాహిక పరిశోధకులకు శుభాకాంక్షలు. 1928లో ఇదే రోజున సర్ సీవీ రామన్ ఆవిష్కరించిన 'రామన్ ఎఫెక్ట్' ద్వారా భారతీయ నవ్య విజ్ఞాన శాస్త్రం కొత్త పుంతలు తొక్కిందం’టూ ఆయన తన ట్వీట్లు రాసుకొచ్చారు.



Updated Date - 2021-02-28T22:14:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising