ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్‌లోకి డీఎస్ వెళ్లిపోయారు: వీహెచ్

ABN, First Publish Date - 2021-12-18T18:16:42+05:30

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో డి శ్రీనివాస్ అన్నీ అనుభవించారన్నారు. రెండు సార్లు పీసీసీ ఎంజాయ్ చేశారని.. అయితే పార్టీ కష్టాల్లో ఉన్నపుడు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారన్నారు. డి శ్రీనివాస్ కుమారుడు బీజేపీలో ఎంపీ అయ్యారన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఫోన్లు వస్తున్నాయని.. కష్టాల్లో ఉన్నపుడు పార్టీని వీడి ఇప్పుడు వస్తే ఎలా అని అడుగుతున్నారని వీహెచ్ పేర్కొన్నారు. డి శ్రీనివాస్ కొడుకు కూడా కాంగ్రెస్‌లోకి రావాలన్నారు. కేవలం డి.శ్రీనివాస్ చేరిక వల్ల పార్టీకి ఉపయోగం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. గతంలో చేసిన తప్పును సరిదిద్దుకున్నా.. తన కుటుంబం అంతా కాంగ్రెస్ కుటుంబం అన్నపుడు అరవింద్‌ను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చాలన్నారు. టీఆర్ఎస్‌లో పదవీకాలం ముగుస్తుందని... మళ్ళీ ఇస్తారో లేదో తెలీదని.. అందుకే టీఆర్ఎస్‌ను వీడుతున్నారని వీహెచ్ తెలిపారు.

Updated Date - 2021-12-18T18:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising