ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీయే మెచ్చుకున్న ఈ వ్యక్తి గుర్తున్నాడా..? తాజా వివాదమేంటంటే..

ABN, First Publish Date - 2021-06-20T02:38:48+05:30

ఇన్ని రోజుల తర్వాత మళ్లీ రాజప్పన్ పేరు తెర మీదకు వచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌ఎస్ రాజప్పన్.. కేరళకు చెందిన 72 ఏళ్ల ఈ దివ్యాంగుడు తన నిస్వార్థ సేవతో దేశం మొత్తాన్ని ఆకట్టుకున్నాడు. ఏకంగా ప్రధాని మోదీయే రాజప్పన్‌ను ప్రశంసించారు. దివ్యాంగుడు అయిన రాజప్పన్ గత ఆరేళ్లుగా రోజూ కేరళలోని వెంబనాడ్ సరస్సులో ప్లాస్టిక్ వ్యర్థాల్ని కలెక్ట్ చేస్తున్నాడు. ఓ చిన్న పడవను అద్దెకు తీసుకొని రోజూ ఉదయాన్నే నదిలోకి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుతున్నాడు. తాను ఏ నది పక్కన పెరిగాడో... ఆ నది ఎప్పటికీ కాలుష్యం లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు.


ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) చీఫ్ ఎరిక్ సోల్హెమ్, ప్రధాని మోదీ రాజప్పన్‌ను గతంలో ప్రశంసించారు. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ రాజప్పన్ పేరు తెర మీదకు వచ్చింది. అయితే అది ఓ వివాదం విషయంలో కావడం గమనార్హం. తన చెల్లి విలాసిని, ఆమె భర్త కుట్టప్పన్ తన బ్యాంక్ ఖాతా నుంచి తనకు తెలియకుండా 5 లక్షల రూపాయలు తీసుకున్నారని రాజప్పన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తను సంతకం చేసిన చెక్ ద్వారా వారు డబ్బు తీసుకున్నారని కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-06-20T02:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising