ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండిపోతున్న కూరగాయల ధరలు

ABN, First Publish Date - 2021-11-24T18:33:50+05:30

భారీ వర్షాలతో కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతినడంతో ధరలు ఆకాశన్నంటాయి. నెలరోజులుగా మండిపోతున్న కూరగాయల ధరలతో సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. ప్రత్యేకించి కొన్ని కూరగాయల ధరలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సామాన్య ప్రజల విలవిల 

- వర్షాల కారణంగా దెబ్బతిన్న తోటలు 


బెంగళూరు: భారీ వర్షాలతో కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతినడంతో ధరలు ఆకాశన్నంటాయి. నెలరోజులుగా మండిపోతున్న కూరగాయల ధరలతో సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. ప్రత్యేకించి కొన్ని కూరగాయల ధరలు కిలో వంద దాటేశాయి. ఇలా కూరగాయల ధరలు వంద రూపాయలు దాటిన సంఘటన ఇటీవలకాలంలో సంభవించలేదని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. క్యాప్సికమ్‌, క్యారెట్‌, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, కాకరకాయల ధర రిటైల్‌ దుకాణాలలో వంద పైచిలుకే పలుకుతున్నాయి. ఇక వంకాయలు, టమోటాల ధర కిలో రూ.60-80 దాకా పలుకుతోంది. కారుచౌకగా లభించే ముల్లంగి సైతం కిలో రూ.60పైగానే ఉంది. సీజన్‌ కాకపోవడంతో మునక్కాయల ధర కిలో రూ.230పైచిలుకే ఉంది. ఇక బజ్జీ మిరపకాయల ధర కిలో రూ.130 దాకా పలుకుతోంది. వీటికితోడు ఆకుకూరల ధరలు కూడా మండిపోతున్నాయి. కనీసం ఆకు కట్ట రూ.30పైగానే ఉంది. ఇక ఇతర కూరగాయల ధరలు కూడా కిలో రూ.50పైనే ఉండడంతో ఏం కొనాలో అర్థం కాక సామాన్యులు విలవిలలాడుతున్నారు. మరికొద్దిరోజులు కూరగాయల ధరలు ఇలాగే ఉంటాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Updated Date - 2021-11-24T18:33:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising