ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారణాసి మిమ్మల్ని ‘బయటివారు’ అనబోదు : మోదీ

ABN, First Publish Date - 2021-04-04T01:31:52+05:30

వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మమత బెనర్జీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మమత బెనర్జీ పోటీ చేస్తారని టీఎంసీ చెప్పిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. ఆమెను బయటి వ్యక్తిగా వారణాసి భావించబోదని చెప్పారు. వారణాసి నుంచి ఆమె పోటీ చేయవచ్చునన్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌లో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. 


2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మమత బెనర్జీ వారణాసి నుంచి పోటీ చేస్తారని టీఎంసీ చెప్తోందని మోదీ అన్నారు. ఈ ప్రకటననుబట్టి రెండు అంశాలు స్పష్టంగా వెల్లడవుతున్నాయన్నారు. వాటిలో ఒకటి, బెంగాల్‌లో టీఎంసీ ఓటమిని మమత అంగీకరించారని చెప్పారు. ఔనా? కాదా? అని ప్రజలను అడిగారు. బెంగాల్‌లో గెలుస్తామనుకుంటే బయటికి ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. రెండో అంశాన్ని వివరిస్తూ, పశ్చిమ బెంగాల్‌కు వెలుపల చోటు కోసం మమత అన్వేషిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019 ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-04-04T01:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising