ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులు ఏప్రిల్‌లో రావద్దు : వారణాసి డీఎం

ABN, First Publish Date - 2021-04-15T20:06:16+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న మూడు సుప్రసిద్ధ దేవాలయాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారణాసి : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న మూడు సుప్రసిద్ధ దేవాలయాలకు ఏప్రిల్‌లో రావాలనుకునే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరింది. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రంగా ఉన్నందువల్ల ఈ సలహా ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వారణాసి జిల్లాలో 10,206 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ మాట్లాడుతూ, కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ మునుపెన్నడూ లేనంత అదికంగా నమోదవుతున్నాయన్నారు. ఈ నెలలో వారణాసిలోని దేవాలయాలను సందర్శించేందుకు రావాలనుకుంటున్నవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. దేశీయ, అంతర్జాతీయ భక్తులు ఏప్రిల్‌లో వారణాసికి రావద్దని కోరారు. 


వారణాసి డివిజినల్ కమిషనర్ దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ, విశ్వనాథ్ దేవాలయం, సంకట మోచన దేవాలయం, అన్నపూర్ణ దేవాలయాలను సందర్శించేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్‌ను చూపించాలని చెప్పారు. వారణాసిలో ప్రవేశించడానికి ముందు మూడు రోజుల్లో ఈ సర్టిఫికేట్‌ను పొంది ఉండాలని చెప్పారు. నగరంలోని హోటళ్ళకు కూడా  ఈ  నిబంధనలు వర్తిస్తాయన్నారు. 


Updated Date - 2021-04-15T20:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising