ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలపై కోవ్యాక్సిన్ టీకా ప్రయోగాలు

ABN, First Publish Date - 2021-03-04T16:51:22+05:30

ప్రపంచంలో తొలిసారిగా భారత్‌లో పిల్లలపై కరోనా వ్యాక్సిన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచంలో తొలిసారిగా భారత్‌లో పిల్లలపై కరోనా వ్యాక్సిన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు ప్రయోగాలు జరగనున్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ టీకా కోవ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్‌ను పిల్లలపై ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


అయితే ప్రస్తుతానికి ఐదేళ్లలోపు చిన్నారులపై ఈ ప్రయోగాలకు మినహాయింపునిచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భారత్ బయోటెక్ తాజాగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీకి దీనిపై ప్రతిపాదనను పంపింది. తాము చిన్నారులపై కోవ్యాక్సిన్ ప్రయోగాలు చేయాలనుకుంటున్నామని తెలియజేసింది. కాగా ఇంతకుముందే కోవ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ జరిగాయి. కరోనా వ్యాక్సినేషన్ మూడవ దశ నాటికల్లా చిన్నారులకు టీకా అందించాలని భారత్ బయోటెక్ భావిస్తోంది. ఇందుకోసం ఐదేళ్లు దాటి, 18 ఏళ్ల లోపుగల పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించనున్నారు. అయితే నిపుణుల కమిటీ చిన్నారులపై వ్యాక్సిన్ పరీక్షలకు ఇంకా అనుమతినివ్వలేదు. పెద్దలపై వ్యాక్సిన్ ప్రభావాలను పూర్తి స్థాయిలో పరీక్షించిన అనంతరం నిపుణుల కమిటీ పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలకు అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Updated Date - 2021-03-04T16:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising