ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో కరోనా యాంటీజెన్ టెస్టులు

ABN, First Publish Date - 2021-03-18T12:20:00+05:30

దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా కట్టడికి నూతన గైడ్‌లైన్స్ విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులకు, వైద్యశాఖాధికారులకు లేఖలు రాశారు. దీనిప్రకారం రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ, రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికులకు యాంటీజెన్ టెస్టులు చేపట్టాలని ఆదేశించారు. 


అలాగే కరోనా లక్షణాలు కనిపించినవారికి ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం నమూనాలు సేకరించాలని తెలిపారు. కరోనా కేసులు కనిపిస్తున్న ప్రాంతాలలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని కోరారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోనికి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఇదేవిధంగా ప్రజలంతా సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడాలని, మాస్కులు ధరించడంతోపాటు కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. కాగా రాష్ట్రంలోని గజియాబాద్ లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దృష్ట్యా మే 25 వరకూ 144 సెక్షన్ విధించారు.

Updated Date - 2021-03-18T12:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising