ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vaccination: ఒక్కరోజులో 22 లక్షల డోసులు.. దేశంలోన నెంబర్ వన్

ABN, First Publish Date - 2021-08-04T07:57:24+05:30

దేశంలోనే వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్ టాప్ ప్లేస్‌కు చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: దేశంలోనే వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్ టాప్ ప్లేస్‌కు చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏకంగా 22 లక్షల కోవిడ్ వ్యాక్సిన్‌లను ఒక్కరోజులో ప్రజలకు అందించి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. అంతేకాకుండా ఈ ఫీట్‌పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ట్వీట్ చేశారు. ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల ఆధారంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ దిగ్విజయంగా కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కవచంలా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కోవిడ్‌పై విజయానికి టీకానే మార్గమని పేర్కొన్నారు.


కాగా.. మంగళవారం ఒక్కరోజే సాయంత్రం 7 గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 51 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర శాఖ ప్రకటించింది. మొత్తంగా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 48 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2021-08-04T07:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising