ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uttarakhand: మంత్రి యశ్‌పాల్ ఆర్య, ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యలు కాంగ్రెస్‌లో చేరిక

ABN, First Publish Date - 2021-10-11T18:12:25+05:30

ఉత్తరాఖండ్ రవాణా శాఖ మంత్రి మంత్రి యశ్‌పాల్ ఆర్య,అతని కుమారుడు, ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యలు సోమవారం కాంగ్రెస్‌లో చేరారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రవాణా శాఖ మంత్రి మంత్రి యశ్‌పాల్ ఆర్య,అతని కుమారుడు, ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యలు సోమవారం కాంగ్రెస్‌  పార్టీ తీర్థం స్వీకరించారు.ఉత్తరాఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో యశ్ పాల్ ఆర్య రవాణాశాఖ మంత్రిగా ఉండగా, అతని కుమారుడు సంజీవ్ నైనిటాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీష్ రావత్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ ల సమక్షంలో యశ్ పాల్ ఆర్య,సంజీవ్ లు కాంగ్రెస్‌లో చేరారు.భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి వారు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 


యశ్ పాల్ ఆర్య ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా చెప్పారు.యశ్‌పాల్ ఆర్యకు ఘర్ వాపసీ లాంటిదని అన్నారు. యశ్‌పాల్ ఆర్య 2007 నుంచి 2014 వరకు ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  చీఫ్‌గా ఉన్నారు.బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరడం చూస్తుంటే ఉత్తరాఖండ్‌లో ఏ విధంగా గాలి వీస్తుందో స్పష్టమైన సూచన అని కేసీ వేణుగోపాల్ చెప్పారు.


Updated Date - 2021-10-11T18:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising