ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుంభమేళా కోవిడ్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు

ABN, First Publish Date - 2021-06-15T18:36:59+05:30

మహా కుంభమేళా సందర్భంగా కోవిడ్ పరీక్షల్లో అవకతవకలు చోసుకున్నాయన్న ఆరోపణలపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరాఖండ్: మహా కుంభమేళా సందర్భంగా కోవిడ్ పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. లక్ష వరకు నకిలీ కోవిడ్ పరీక్షల రిపోర్టుల అంశంపై జరిపిన విచారణలో ఒకే ఫోన్ నెంబర్‌తో 50 మందికి పరీక్షలు జరిగినట్లు వెల్లడైంది. విచారణాధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. అంతేకాకుండా కోవిడ్ టెస్టు ల్యాబ్‌ల రిపోర్టులలో ఇంకా చాలా అవకతవకలు జరిగినట్లుగా కమిటీ సభ్యులు గుర్తించినట్లు సమాచారం.


ఉత్తరాఖండ్ మహాకుంభమేళా ఆధ్యాత్మిక క్రతువు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కరోనా మహమ్మారి విజృంభణ సయయంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఉత్తరాఖండ్ మహాకుంభమేళాను నిర్వహించారు. అయితే కుంభమేళాకు భక్తులు పోటెత్తిన దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కుంభమేళాకు వచ్చిన భక్తులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఓ ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించింది. అయితే కుంభమేళాలో నిర్వహించిన కోవిడ్ పరీక్షలు, రిపోర్టుల్లో సుమారు లక్ష వరకు నకిలీ నివేదికలేనని దర్యాప్తులో వెల్లడైంది.

Updated Date - 2021-06-15T18:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising