ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేల్చి చెప్పిన మాయావతి

ABN, First Publish Date - 2021-01-15T16:40:39+05:30

దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఇక్కడి అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల వ్యవధి ఉంది. ఎన్నికల్లో పొత్తులపై అప్పుడే రాజకీయ చర్చ మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఇక్కడి అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల వ్యవధి ఉంది. ఎన్నికల్లో పొత్తులపై అప్పుడే రాజకీయ చర్చ మొదలైంది. ఎవరెవరు కలిసి పోటీ చేయనున్నారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తాజాగా స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. పొత్తుల్లేకుండా తమ పార్టీ బరిలోకి దిగనుందని ప్రకటించారు. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు తెలిపారు. సొంతంగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పారు. 


ఇదిలా ఉంటే, కోవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను బీఎస్పీ స్వాగతించింది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందించాలని ఆ పార్టీ అధినేత్రి కోరారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులకు తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందన్నారు. రైతుల డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-01-15T16:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising