ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యూబాపై అమెరికా ఆంక్షలు

ABN, First Publish Date - 2021-01-17T08:15:36+05:30

క్యూబా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆ శాఖ మంత్రిపై అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హవానా, జనవరి 16: క్యూబా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆ శాఖ మంత్రిపై అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించింది. వారు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించింది. మంత్రిత్వ శాఖతో పాటు ఆ శాఖ మంత్రి లజారో ఆల్బెర్టోకు అమెరికాలో ఉన్న బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో పాటు అమెరికా సంస్థలతో వ్యాపార సంబంధాలను నిలిపివేసింది. తన పదవీ కాలం ముగియడానికి వారం కన్నా ముందే డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటువంటి ఆంక్షలు తేవడం క్యూబాతో ఆయనకు ఉన్న బలమైన వైరాన్ని తెలియజేస్తోంది.


‘‘క్యూబా సహా ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా బాధితులకు అమెరికా అండగా నిలబడుతుంది’’ అని ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్‌ నుచిన్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలు, అవినీతికి పాల్పడే వారిపై గ్లోబల్‌ మాగ్నిట్‌స్కీ హ్యూమన్‌ రైట్స్‌ అకౌంటబిలిటీ చట్టం కింద ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రభుత్వం తెలిపింది.


Updated Date - 2021-01-17T08:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising