ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Afghanistan: ఐసిస్ అటాక్ ప్లానర్‌పై అమెరికా వైమానిక దాడి

ABN, First Publish Date - 2021-08-28T13:49:45+05:30

ఆత్మాహుతి బాంబు దాడులకు ప్రతీకారంగా అమెరికా మిలటరీ ఇస్లామిక్ స్టేట్ కీలక సభ్యుడిపై వైమానిక దాడి చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ నగర హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి బాంబు దాడులకు ప్రతీకారంగా అమెరికా మిలటరీ ఇస్లామిక్ స్టేట్ కీలక సభ్యుడిపై వైమానిక దాడి చేసింది. ఇస్లామిక్ స్టేట్ సభ్యుడిపై అమెరికా వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. కాబూల్ పేలుళ్లు జరిగిన 48 గంటల తర్వాత నంగహర్ లో ఇస్లామిక్ స్టేట్ అటాక్ ప్లానర్ పై దాడి చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ మిలటరీ శనివారం ఉదయం వెల్లడించింది. ఐసిస్-ఖోరాసన్ ఆత్మాహుతి దాడిలో 169 మంది అఫ్ఘాన్లు, 13మంది అమెరికన్ సేవా సభ్యులు మరణించారు. 


కాబూల్ పేలుళ్ల సూత్రధారి అయిన నంగహర్ లోని కీలక ఐసిస్ ఖోరాసన్ సభ్యుడిపై అమెరికా సైనికులు జరిపిన వైమానిక దాడిలో అతను మరణించాడని అమెరికా తెలిపింది. ఈ వైమానిక దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నేవీ కెప్టెన్ విలియం అర్బన్ పేర్కొన్నారు. వైమానిక దాడుల నేపథ్యంలో అమెరికన్ సైనికులు కాబూల్ విమానాశ్రయం గేట్లను వెంటనే వదిలి రావాలని పెంటగాన్ సూచించింది.


Updated Date - 2021-08-28T13:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising