ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంతర్ మంతర్ వద్ద Civil Services అభ్యర్థుల ఆందోళన

ABN, First Publish Date - 2021-11-29T16:39:23+05:30

కొవిడ్ మహమ్మారి కారణంగా తాము సివిల్స్ సర్వీసు పరీక్షలకు సజావుగా సన్నద్ధం కానందువల్ల యూపీఎస్సీ పరీక్షలకు హాజరు కావడానికి అదనపు అవకాశం కల్పించాలని కోరుతూ అభ్యర్థులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి కారణంగా తాము సివిల్స్ సర్వీసు పరీక్షలకు సజావుగా సన్నద్ధం కానందువల్ల యూపీఎస్సీ పరీక్షలకు హాజరు కావడానికి అదనపు అవకాశం కల్పించాలని కోరుతూ అభ్యర్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు.కొవిడ్ వల్ల తాము సివిల్స్ పరీక్ష రాసేందుకు అదనపు అవకాశం కల్పించాలని అభిషేక్ ఆనంద్ సిన్హా అనే అభ్యర్థి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.చాలామంది అభ్యర్థులకు కరోనా సోకడంతో వారు క్వారంటైన్ అయ్యారని, కొందరు అభ్యర్థులు వారి కుటుంబసభ్యులను కరోనాతో కోల్పోయారని, అలాంటి సమయాల్లో వారెలా చదవగలరని సిన్హా ప్రశ్నించారు.


వైద్యులైన కొందరు అభ్యర్థులు కరోనా సమయంలో రాత్రీ పగలూ పనిచేశారని, అలాంటపుడు సివిల్స్ పరీక్షలకు ఎలా సిద్ధమవుతారని ఓ అభ్యర్థి ప్రశ్నించారు.దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సివిల్స్ అభ్యర్థులు జంతర్ మంతర్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. తాను గత ఐదేళ్లుగా యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని, గత ఏడాది చివరి ప్రయత్నానికి ముందు కరోనాతో తన తండ్రి మరణించాడని గౌరవ్ అనే అభ్యర్థి చెప్పారు. కరోనాతో తండ్రి మరణించడంతో తాను మానసికంగా పరీక్షకు ఎలా సిద్ధం అవుతానని గౌరవ్ ప్రశ్నించారు. తమకు సివిల్స్ పరీక్ష రాసేందుకు మరో అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-29T16:39:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising