రానున్నది ‘భారత టెకేడ్’
ABN, First Publish Date - 2021-07-09T07:51:53+05:30
రానున్న దశాబ్ధంలో భారతీయ టెక్నాలజీ సంస్థలు వివిధ రంగాల్లో కీలకపాత్ర పోషించనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
విద్యాసంస్థల డైరెక్టర్లతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూలై 8: రానున్న దశాబ్ధంలో భారతీయ టెక్నాలజీ సంస్థలు వివిధ రంగాల్లో కీలకపాత్ర పోషించనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే దీన్ని ‘భారతదేశ సాంకేతిక దశాబ్ధం (టెకేడ్)’గా చెబుతున్నామన్నారు. దేశంలోని వందకుపైగా ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలు; పరిశోధన, అభివృద్ధి సంస్థలకు చెందిన డైరెక్టర్లతో ప్రధాని గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీరిలో ఐఐటీలతోపాటు బెంగళూరులోని ఐఐఎ్‌ససీ, కేంద్ర నిధులతో కొనసాగుతున్న మరికొన్ని సంస్థల డైరెక్టర్లు ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక, ఉన్నత విద్యలో మార్పులు తీసుకురావాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ, సైబర్ టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్తులో ఎదురుకానున్న సవాళ్లకు పరిష్కారాలు కనుక్కోవడంపై సాంకేతిక విద్యాసంస్థలు దృష్టి సారించాలన్నారు.
వెనుకబడిన వర్గాలు, యువత, మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ.. తక్కువ ఖర్చుతో, ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను వారికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా నేపథ్యంలో తలెత్తిన అనేక రకాల సాంకేతిక సమస్యలకు యువ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు వేగంగా పరిష్కారాలు కనుక్కున్నారని ప్రశంసించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కొత్తగా నియమితులైన ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఐఐటీల్లో కొనసాగుతున్న వివిఽధ ప్రాజెక్టులు, నూతన పరిశోధనల వివరాలను ప్రధానికి ఆయా సంస్థల డైరెక్టర్లు వివరించారు.
Updated Date - 2021-07-09T07:51:53+05:30 IST