ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కట్నం తీసుకోనట్టు సర్టిఫికెట్ ఉండాల్సిందే: ప్రభుత్వ అధికారులకు ఆదేశం

ABN, First Publish Date - 2021-10-18T03:25:58+05:30

వరకట్న నిరోధక చట్టాన్ని మరింత బలపర్చేందుకు ఉత్తరప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ తాజాగా ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు అంతా కట్నం తీసుకోనట్టు అఫిడవిట్ సమర్పించాలని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: వరకట్న నిరోధక చట్టాన్ని మరింత బలపర్చేందుకు ఉత్తరప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ తాజాగా ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు అంతా కట్నం తీసుకోనట్టు అఫిడవిట్ సమర్పించాలని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. 2004, ఏప్రిల్ 31 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ అక్టోబర్ 12 సర్క్యూలర్ ప్రకారం అక్టోబర్ 18లోపు వరకట్నం తీసుకోనట్టు అఫిడవిట్ సమర్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎవరైనా వరకట్నం తీసుకున్నట్లు తెలిస్తే తగిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు పేర్కొంది.


ఈ విషయమై ఉత్తరప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మనోజ్ రాయ్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో వరకట్న నిరోధక చట్టం అమలులో ఉంది. ఆ నిబంధనలకు లోబడి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వరకట్నం తీసుకోలేదని ధ్రువీకరిస్తూ అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించాం. వరకట్న నిరోధక చట్టం అమలుపై ఒక నివేదిక వస్తుంది. దాన్ని ప్రభుత్వానికి అందిస్తాం’’ అని పర్కొన్నారు.

Updated Date - 2021-10-18T03:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising