ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిరోజాబాద్: బాధిత చిన్నారులతో ఆసుపత్రులు ఫుల్... ఇంట్లోనే వైద్యం అందించాల్సిన దుస్థితిలో తల్లిదండ్రులు!

ABN, First Publish Date - 2021-09-04T14:05:49+05:30

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో వైరల్ ఫీవర్, డెంగ్యూలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో వైరల్ ఫీవర్, డెంగ్యూలు మరింతగా వ్యాప్తిచెందుతుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆసుపత్రిలో పడకలు లభ్యం కాకపోవడంతో బాధితులు పలు అవస్థలు పడుతున్నారు. వైద్యుల సలహా మేరకు తమ ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఝల్కారీ నగర్‌లో పలు కుటుంబాల్లోని చిన్నారులు వైరల్ ఫీవర్, డెంగ్యూ బారిన పడ్డారు. వీరికి ఆసుపత్రులలో పడకలు లభించలేదు. 


దీంతో వీరంతా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన రాజీవ్ కుమార్ కొడుకు వైభవ్ గత కొంతకాలంగా డెంగ్యూతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స చేయిద్దామంటే ఎక్కడా పడకలు లభ్యం కాలేదు. దీంతో రాజీవ్ కుమార్ తన కొడుకుకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. ఫిరోజాబాద్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 100 బెడ్లు ఉండగా, 325కు పైగా బాధితులు ఇక్కడ చికిత్స పొందుతున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2021-09-04T14:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising