ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములాయం ఇంట్లో యూపీ ఎన్నికల వేడి... వరుస భేటీలు!

ABN, First Publish Date - 2021-08-10T11:40:33+05:30

దేశ రాజకీయాల్లో ఈమధ్య నేతల భేటీలు ముమ్మురంగా సాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఈమధ్య నేతల భేటీలు ముమ్మురంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విపక్షాల నేతలను తరచూ కలుసుకుంటూ మంతనాలు సాగిస్తున్నారు. ఇదేసమయంలో సమాజ్‌వాదీ పార్టీ సంరక్షుడు ములాయం సింగ్ యాదవ్ కూడా 2022 యూపీ ఎన్నికలకు ముందుగా యాక్టివ్ మోడ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నారు. ఆయన ఢిల్లీలోని తన నివాసంలో తరచూ పలువురు నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. 


సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ ఇంటికి రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ రాగా, ఇరువురూ మంతనాలు సాగించారు. తరువాత హరియాణా మాజీ ముఖ్యమంత్రి, ఇండియనే నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలా కూడా ములాయం ఇంటికి వచ్చి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చౌతాలా మాట్లాడుతూ ములాయం యోగక్షేమాలు తెలుసుకునేందుకే వచ్చానని తెలిపారు. యూపీ ఎన్నికల గురించి కూడా చర్చించామన్నారు. కాగా పశ్చిమ యూపీలో జాట్ ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఓం ప్రకాష్ చౌతాలాకు వీరి మధ్య మంచి ఆదరణ ఉందని చెబుతుంటారు.

Updated Date - 2021-08-10T11:40:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising