ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UP Congress: టికెట్ల దరఖాస్తుల పర్వం ప్రారంభం

ABN, First Publish Date - 2021-09-15T17:50:12+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోరుకునే వారు దరఖాస్తుతోపాటు 11వేల రూపాయల నగదును చెల్లించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ కోరారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పార్టీ టిక్కెట్ల కోసం దరఖాస్తుతోపాటు రూ.11వేలు చెల్లించండి

యూపీసీసీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ డిమాండ్ 

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోరుకునే వారు దరఖాస్తుతోపాటు 11వేల రూపాయల నగదును చెల్లించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తులతోపాటు 11వేల రూపాయల విరాళంతో ఈ నెల 25వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అజయ్ కుమార్ సూచించారు.ఈ మేర యూపీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నేతలకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. దరఖాస్తులను జిల్లా, నగర పార్టీ అధ్యక్షులకు సమర్పించాలని ఆయన సూచించారు.


యూపీలో ఉన్న 403 అసెంబ్లీ స్థానాలుండగా, సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలున్న 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీలు ఓ జాబితాను రూపొందించి రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికలకమిటీకి పంపిస్తాయని ఆయన చెప్పారు. జాబితాలోని పేర్లను పరిశీలించి వాటిలో కొన్నింటిని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తామని యూపీసీసీ అధినేత చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులను వారి రాజకీయ కార్యకలాపాల వివరాలతో సమర్పించాలని అజయ్ కుమార్ కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో 12వేల కిలోమీటర్ల దూరం యాత్రను వచ్చే నెలలో ప్రారంభిస్తామని యూపీసీసీ అధ్యక్షుడు చెప్పారు. 

Updated Date - 2021-09-15T17:50:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising