ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yogi Adityanath: త్వరలోనే యూపీ కేబినెట్ విస్తరణ

ABN, First Publish Date - 2021-07-16T01:51:57+05:30

తన కేబినెట్‌ను త్వరలోనే విస్తరించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: తన కేబినెట్‌ను త్వరలోనే విస్తరించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఈ విషయమై రేపు (శుక్రవారం) జగరగనున్న యూపీ బీజేపీ వర్కింగ్ కమిటీ మీటింగులో చర్చించనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇదికాకుండా, కేబినెట్ విస్తరణపైనా సమావేశంలో చర్చిస్తారని ఈ విషయంలో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. 


ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఇటీవల తన కేబినెట్‌ను విస్తరించారు. ఈ సందర్భంగా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీ నుంచి కేబినెట్‌లోకి ఏడుగురు ఎంపీలను తీసుకున్నారు.


మొత్తం 14 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. కేంద్ర కేబినెట్‌లో అత్యధిక మంత్రులు ఉన్నది యూపీ నుంచే. యూపీ నుంచి 84 మంది ఎంపీలు కేంద్రంలో ఉన్నారు. వీరిలో 62 మంది లోక్‌సభలో, 22 మంది రాజ్యసభలో ఉన్నారు. దీని మిత్రపక్షమైన అప్నా దళ్ నుంచి ఇద్దరు ఉన్నారు. కేంద్ర కేబినెట్‌లో యూపీ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో మంత్రులు ఉండడం ఇదే తొలిసారి. 

Updated Date - 2021-07-16T01:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising