ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ వ్యాక్సిన్ తో నపుంసకత్వం. బ్రిటన్ గాయని రచ్చ

ABN, First Publish Date - 2021-09-15T21:37:01+05:30

కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా తన కజిన్ వాళ్ల ఫ్రెండ్‌కి నపుంసకత్వం వచ్చేసిందంటూ కలకలం రేపింది బ్రిటన్ గాయని నిక్కీ మినాజ్. ట్రినిడాడ్‌లోని అతనికి టీకా తీసుకున్న తరువాత వృషణాలు వాచాయంటూ వింత విషయాన్ని చెప్పిందామె.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా తన కజిన్ వాళ్ల ఫ్రెండ్‌కి నపుంసకత్వం వచ్చేసిందంటూ కలకలం రేపింది బ్రిటన్ గాయని నిక్కీ మినాజ్. ట్రినిడాడ్‌లోని అతనికి టీకా తీసుకున్న తరువాత వృషణాలు వాచాయంటూ వింత విషయాన్ని చెప్పిందామె. కాకపోతే, బ్రిటన్‌లో ప్రఖ్యాత ర్యాపర్ అయిన నిక్కీ మాటల్ని ఆ దేశ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. స్వయంగా చీఫ్ మెడికల్ అడ్వైజర్ క్రిస్ విట్టీ దీనిపై  స్పందించారు. ‘‘పచ్చి అబద్ధాలు’’ అంటూ కొట్టిపారేశారు. నిక్కీ మాటలు జనాల్ని భయపెట్టే విధంగా ఉన్నాయన్న ఆయన సొషల్ మీడియాలో ఇలాంటి వదంతులు వ్యాపింపజేసినందుకు ఆమె సిగ్గుపడాలని చెప్పారు. అసలే ప్రపంచం కరోనాతో అల్లాడుతోంటే వ్యాక్సిన్ల విషయంలో అపోహలు కల్పించటం, అదీ నిక్కీ మినాజ్ లాంటి మంచి ఫాలోయింగ్ ఉన్న క్రేజీ సెలబ్రిటీలు, వెనకా ముందు ఆలోచించకుండా మాట్లాడటం... నిజంగా ఆక్షేపనీయమే...         



Updated Date - 2021-09-15T21:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising