ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 నుంచి ఆంక్షల్లేని విమానయానం

ABN, First Publish Date - 2021-10-13T06:44:14+05:30

విమానయాన సంస్థలు ఈ నెల 18 నుంచి పూర్తి సామర్థ్యం మేర దేశీయ విమాన సర్వీసులను నడుపుకోవచ్చు. కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులపై విధించిన పరిమితిని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర విమానయానశాఖ మంగళవారం ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దేశీయ సర్వీసుల్లో సీట్ల పరిమితి ఎత్తివేత
  • విమానాశ్రయాల్లో ఎంపీలకు 
  • ప్రొటోకాల్‌ను కొనసాగించండి: కేంద్రం


న్యూఢిల్లీ, అక్టోబరు 12 : విమానయాన సంస్థలు ఈ నెల 18 నుంచి పూర్తి సామర్థ్యం మేర దేశీయ విమాన సర్వీసులను నడుపుకోవచ్చు. కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులపై విధించిన పరిమితిని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర విమానయానశాఖ మంగళవారం ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా అమలయ్యేలా చూడాలని విమానయాన సంస్థలకు నిర్దేశించింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కూడా ముఖ్యకారణమని భావిస్తున్నారు. 18వ నుంచి ఫ్లైట్‌ ఆపరేటర్లు పూర్తిస్థాయిలో టికెట్లు విక్రయించనున్నారు. 


మే 25 నుంచి ఇప్పటివరకు .. 

కరోనా ఉధృతి నేపథ్యంలో గతేడాది మార్చి 25 నుంచి మే 24 వరకు దేశీయ విమాన సర్వీసులు నడవలేదు. విమాన సామర్థ్యంలో 33 శాతం మంది ప్రయాణికులతో విమానాలు నడుపుకోవచ్చంటూ 2020 మే 25న కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 2020 డిసెంబరు నాటికి సీట్ల భర్తీ పరిమితిని 80 శాతానికి పెంచగా, 2021 జూన్‌ 1 వరకు అదే నిబంధన అమలైంది. ఈ ఏడాది జూన్‌లో కరోనా కేసులు భారీగా పెరగడంతో మళ్లీ సీట్ల పరిమితిలో కోత విధించి 80 శాతం నుంచి 50 శాతానికి కేంద్రం తగ్గించింది. జూన్‌ 1 నుంచి జూలై 15 వరకు 50 శాతం సీట్లు, జూలై 5 నుంచి ఆగస్టు 12 వరకు 65 శాతం సీట్లు, ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 18 వరకు 72.5 శాతం సీట్లతో దేశీయ విమానాలు నడిచాయి. 2021 సెప్టెంబరు 18 నుంచి 85 శాతం మంది ప్రయాణికులతో సర్వీసులు నడుస్తున్నాయి.


ఈ నేపథ్యంలో సీట్ల పరిమితి నిబంధనను ఎత్తివేసి, పూర్తిస్థాయి ప్రయాణికులతో విమానాలను నడుపుకునే వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా, విమానాశ్రయాలు, విమానాల్లో ఎంపీలకు ప్రొటొకాల్‌ను కొనసాగించాలని విమానయాన సంస్థలను విమానయాన శాఖ కోరింది. విమానాశ్రయాల్లో కొందరు ఎంపీలకు ప్రొటొకాల్‌ ప్రకారం దక్కాల్సిన మర్యాద దక్కలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈమేరకు సూచనలు చేసింది.

Updated Date - 2021-10-13T06:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising