ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంచలనం.. Union Minister పై మహారాష్ట్ర పోలీసుల కేసు.. అరెస్ట్ చేస్తారా..!?

ABN, First Publish Date - 2021-08-24T14:10:12+05:30

కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాసిక్ (మహారాష్ట్ర): కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. పాల్ఘార్ జిల్లాలోని వాసాయి, విరార్ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జన్ ఆశీర్వాద్ యాత్రలో కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారు.కొవిడ్ నిబంధనలైన నిషేధిత ఉత్తర్వులను ఉల్లంఘించి జన్ ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నందుకు కేంద్రమంత్రి నారాయణ్ రాణేతోపాటు బీజేపీ నేతలపై మానిక్ పూర్, తులింజ్, కాశిమీరా, వలీవ్,వసాయ్, విరార్, నాసిక్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేశారు. సీఎం ఠాక్రేపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాణేపై నాసిక్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. 


దీంతో కేంద్రమంత్రి నారాయణ్ రాణేను అరెస్టు చేయనున్నారనే వార్తలు వెలువడ్డాయి. యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి నారాయణ్ రాణేతోపాటు జన ఆశీర్వాద యాత్ర నిర్వాహకులపై ఐపీసీ, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ , డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనల కింద అభియోగాలు మోపారని, అయితే ఇంకా మంత్రిని అరెస్టు చేయలేదని పోలీసులు వివరించారు.

Updated Date - 2021-08-24T14:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising