ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రకు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే హామీ

ABN, First Publish Date - 2021-07-25T22:19:19+05:30

మహారాష్ట్ర వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్ర వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఆదివారం హామీ ఇచ్చారు. వరదల వల్ల రాష్ట్రంలోని పశ్చిమ, తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తాలియే గ్రామానికి చెందినవారు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 


వరద ప్రభావిత మహద్‌ ప్రాంతంలో నారాయణ్ రాణే ఆదివారం పర్యటించారు. గురువారం ధ్వంసమైన తాలియే గ్రామాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సైన్యం, నావికా దళం, వాయు సేన, కోస్ట్ గార్డ్, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక తదితర సంస్థలు వరద బాధితులకు సహాయం అందజేయడంలో చేస్తున్న కృషిని ప్రశంసించారు. సహాయ, పునరావాస కార్యకలాపాలను తనిఖీ చేశారు.  వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, నివేదికను సమర్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను ఆదేశించారని చెప్పారు. 


రాణేతోపాటు మాజీ ముఖ్యమంత్రి, శాసన సభలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శాసన మండలిలో బీజేపీ నేత ప్రవీణ్ డరేకర్ ఉన్నారు. 

Updated Date - 2021-07-25T22:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising