ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vaccination: తాజా travel గైడ్ లైన్స్ జారీ చేసిన కేంద్రం

ABN, First Publish Date - 2021-10-21T00:45:19+05:30

భారత దేశానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రయాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత దేశానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రయాణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టును సమర్పించాలని పేర్కొంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటు తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కవరేజ్ పెరగడంతో సవరించిన ఈ మార్గదర్శకాలు ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తాయి. 


కేటగిరీ ‘ఏ’లోకి వచ్చే దేశాల నుంచి భారత దేశానికి వచ్చేవారు అదనపు నిబంధనలను పాటించవలసి ఉంటుంది. భారత దేశానికి వచ్చిన తర్వాత పరీక్షలు చేయించుకోవడం వంటి నిబంధనలను పాటించాలి. దీనిని ఈ నెల 20న అప్‌డేట్ చేశారు. ఈ కేటగిరీలోకి వచ్చే దేశాలు : యునైటెడ్ కింగ్‌డమ్ సహా యూరోపులోని దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే.


కేటగిరీ ‘బీ’లోకి వచ్చే దేశాలతో భారత ప్రభుత్వం ఓ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు పొందిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ డోసులను పూర్తిగా తీసుకున్న వ్యక్తులకు జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను పరస్పరం గుర్తించడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లేదా డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ డోసులను పూర్తిగా తీసుకున్న భారత పౌరులను మినహాయిస్తున్న దేశాలు కూడా ఈ జాబితాలోకి వస్తాయి. యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, అర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగరీ, సెర్బియా ఈ జాబితాలో ఉన్నాయి.  దీనిని ఈ నెల 20న అప్‌డేట్ చేశారు.


Updated Date - 2021-10-21T00:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising