ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఖరారు

ABN, First Publish Date - 2021-10-29T22:14:21+05:30

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) డిపాజిట్లపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) డిపాజిట్లపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్ణయించింది. దీంతో ఈ వడ్డీని ఖాతాదారుల ఖాతాలకు దీపావళినాటికి జమ చేసే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను తెలిపింది. 


ఈపీఎఫ్ఓ చందాదారులు సుమారు 5 కోట్ల మంది ఉన్నారు. డిపాజిట్లపై వడ్డీ రేటును దీపావళి ముందు ఖరారు చేయడం వీరికి శుభవార్త అని చెప్పవచ్చు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈపీఎఫ్ఓకు అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలిగా వ్యవహరిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును ఈ ఏడాది మార్చిలో సీబీటీ నిర్ణయించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ వడ్డీ రేటు 8.5 శాతమే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కన్నా ఉపసంహరణలే అధికంగా జరిగాయి. 


ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి?

ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ను 7738299899 ఫోన్ నంబరు ద్వారా తెలుసుకోవచ్చు. EPFOHO UAN ENG ఫార్మాట్‌లో ఈపీఎఫ్ఓ వద్ద నమోదైన మొబైల్ నంబరు నుంచి 7738299899 ఫోన్ నంబరుకు ఎస్ఎంఎస్ పంపిస్తే, ఖాతా బ్యాలెన్స్‌తో ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈపీఎఫ్ఓ వద్ద నమోదైన మొబైల్ నంబరు నుంచి 011-22901406కు మిస్‌డ్ కాల్ ఇచ్చి కూడా ఖాతా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. 


Updated Date - 2021-10-29T22:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising