ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM-MITRA: ఏడు మెగా textile parksకు ఆమోదముద్ర

ABN, First Publish Date - 2021-10-06T22:55:20+05:30

టెక్స్‌టైల్స్ రంగంలో ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : టెక్స్‌టైల్స్ రంగంలో ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఐదేళ్ళలో రూ.4,445 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయాల్ మీడియాకు తెలిపారు. 


పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 5F vision స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 5F vision అంటే ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్ అని తెలిపారు. 


ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఈ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ, స్థానిక పెట్టుబడులు వస్తాయని పేర్కొంది. 


PM-MITRA (ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కులు) పథకాన్ని 2021 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. మన దేశంలోని టెక్స్‌టైల్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు. వస్త్రాల తయారీకి ఒకే చోట స్పిన్సింగ్, వీవింగ్, ప్రాసెసింగ్/డైయింగ్, ప్రింటింగ్ జరిగే విధంగా సమగ్ర వ్యవస్థ ఏర్పాటుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ఒక్కొక్క పార్కు వల్ల ప్రత్యక్షంగా ఒక లక్ష మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. 


Updated Date - 2021-10-06T22:55:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising