ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండ్లు, కూరగాయలు ఎక్కువ తినేవారికి బ్రిటన్ ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2021-07-27T23:43:29+05:30

బ్రిటన్ ప్రజలు ఫిట్‌నెస్‌తో కళకళలాడాలని ఆ దేశ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : బ్రిటన్ ప్రజలు ఫిట్‌నెస్‌తో కళకళలాడాలని ఆ దేశ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఆరోగ్యకరమైన జీవనశైలిగల కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడంపై అధ్యయనం చేస్తోంది. ఈ ప్రజారోగ్య పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గత ఏడాది కోవిడ్-19 బారినపడి, ఆసుపత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో ప్రజారోగ్యంపై మరింత ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపింది. 


బ్రిటన్‌లో ఊబకాయం పెద్ద సమస్యగా తయారైంది. దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజారోగ్య పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఓ మొబైల్ యాప్ ద్వారా ప్రజల జీవన శైలిని పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజలు కొనే కూరగాయలు, పండ్లు వంటివాటిని, అదేవిధంగా క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేస్తుండటాన్ని పర్యవేక్షించాలని నిర్ణయించింది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా కొంటూ, కేలరీలను తక్కువగా తీసుకునేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందిస్తోంది. 


అధిక బరువుతో బాధపడుతున్న దాదాపు 7 లక్షల మందిని వెయిట్ మేనేజ్‌మెంట్ కోర్సులకు పంపించేందుకు ఆరోగ్యం, సాంఘిక సంక్షేమ శాఖ 70 మిలియన్ పౌండ్లను కేటాయించాలని నిర్ణయించింది. 


Updated Date - 2021-07-27T23:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising