ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ సహకారంతో ఆధార్ డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్ : సౌరభ్ గార్గ్

ABN, First Publish Date - 2021-12-03T23:16:58+05:30

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్స్ ఏర్పాటు కోసం ఇతర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్స్ ఏర్పాటు కోసం ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల సహకారం కోసం ప్రయత్నిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు  ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సీఈఓ సౌరభ్ గార్గ్ చెప్పారు. ఆధార్‌ను ఉపయోగించి నిర్వహించగలిగే లావాదేవీల సంఖ్యను పెంచడం కోసం కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. ఇన్ఫినిటీ ఫోరంలో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మతో ప్యానెల్ డిస్కషన్‌లో ఆయన మాట్లాడారు. 


భవిష్యత్తులో ఇతర దేశాలతో కూడా కలిసి పని చేస్తామని సౌరభ్ చెప్పారు. దేశీయ గుర్తింపు ప్రమాణాల కోసం అంతర్జాతీయ వ్యవస్థల నిర్మాణంలో అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకుంటామన్నారు. సాధికారత కల్పించే సాధనంగా మారిన డిజిటల్ ఐడెంటిటీ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండేవిధంగా వివిధ దేశాలతో అనుబంధం కుదుర్చుకుంటామని తెలిపారు. మన దేశ జనాభాలో 99.5 శాతం మందికి ఆధార్ సంఖ్యలు ఉన్నాయన్నారు. వివిధ లావాదేవీలను తనిఖీ చేయడం కోసం రోజువారీ సుమారు 50 మిలియన్ల ధ్రువీకరణలు జరుగుతున్నాయని చెప్పారు. 


Updated Date - 2021-12-03T23:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising