ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం హెచ్చరిక

ABN, First Publish Date - 2021-11-26T01:31:14+05:30

ఎంస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అక్టోబర్ 28 నుంచి రాష్ట్రంలోని 200 పైగా డిపోల్లో ఉన్న కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగుల జీతాలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం జీతాల పెంపుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న మహారాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక చేసింది. ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఎంఎస్ఆర్టీసీ కార్మికులు శుక్రవారం నాడు ఉద్యోగాల్లో చేరాలని, ముంబై మినహా మహారాష్ట్రలోని ఎంఎస్ఆర్టీసీ కార్మికులు శనివారం నాటికి ఉద్యోగాల్లో చేరాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు 24 గంటల్లో విధులకు హాజరు అవ్వాలని బుధవారం ఆయన 24 గంటల సమయం ఇచ్చారు. అనంతరం గురువారం మరోసారి వారికి డెడ్‌లైన్ విధించారు.


‘‘ఉద్యోగుల జీతభత్యాల ఆధారంగా ₹2,500 నుంచి ₹5,000 వరకు జీతాలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకు అనుగుణంగా హామీ కూడా ఇచ్చాం. దేశ చరిత్రలో ఇంత హైక్ ఎప్పుడూ ఇవ్వలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాల్లో చేరాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు’’ అని అనిల్ పరబ్ అన్నారు.


ఎంస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అక్టోబర్ 28 నుంచి రాష్ట్రంలోని 200 పైగా డిపోల్లో ఉన్న కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగుల జీతాలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం జీతాల పెంపుకు ఒప్పుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Updated Date - 2021-11-26T01:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising