ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పదవిపై ఆశ లేదు

ABN, First Publish Date - 2021-12-27T13:52:47+05:30

మంత్రి పదవి పొందాలనే ఆశ తనకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తనయుడు, డీఎంకే యువ జన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం చేపాక్‌ - ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడిగా ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                          - ఉదయనిధి స్టాలిన్‌


చెన్నై: మంత్రి పదవి పొందాలనే ఆశ తనకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తనయుడు, డీఎంకే యువ జన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం చేపాక్‌ - ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడిగా ఉన్న ఉదయనిధిని మంత్రివర్గంలో చేర్చుకోవాలని, వీలైతే పురపాలక మంత్రిత్వ శాఖను ఆయనకు కేటాయించాలని సీనియర్‌ మంత్రులు, డీఎంకే నాయకులు ఇటీవలికాలంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి ఓ సభలో మాట్లాడుతూ ఉదయనిధికి మంత్రి పదవిని ఇస్తే సమర్థవంతంగా పనిచేయగల డంటూ బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరు జిల్లా కాలపట్టిలో ఆదివారం మధ్యా హ్నం డీఎంకే సభ్యత్వ శిబిరంలో ఉదయనిధి స్టాలిన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో మంత్రులు పొంగలూరు పళనిసామి, సెంథిల్‌ బాలాజీ మాట్లా డుతూ ఉదయనిధికి మంత్రిపదవినివ్వాలని, ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని అన్నారు. చివరగా ఉదయనిధి మాట్లాడుతూ మంత్రులు, పార్టీ సీనియర్‌ నాయకులు తనపై ఉన్న అభిమానంతో మంత్రి కావా లని కోరుకుంటున్నారని చెప్పారు. తాను ఎప్పుడూ మంత్రి పదవికి ఆశపడలేదని, శాసనసభ్యుడిగా, డీఎంకే యువజన విభాగం నిర్వాహకుడిగా అటు ప్రజలలో,ఇటు పార్టీశ్రేణులలో మంచిపేరు సంపాదిం చాలన్నదే తన ప్రధాన ఆశయమని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-27T13:52:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising