ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవరాత్రి డ్రెస్ కోడ్ ఆర్డర్ రద్దు

ABN, First Publish Date - 2021-10-11T00:15:03+05:30

నవరాత్రి ఉత్సావాలు జరిగే రోజుల్లో ఉద్యోగులు తప్పనిసరిగా డ్రస్ కోడ్ పాటించాలంటూ ఓ ప్రభుత్వరంగ బ్యాంకు తమ ఉద్యోగులకు సర్క్యులర్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నవరాత్రి ఉత్సావాలు జరిగే రోజుల్లో ఉద్యోగులు తప్పనిసరిగా డ్రస్ కోడ్ పాటించాలంటూ ఓ  ప్రభుత్వరంగ బ్యాంకు తమ ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేసింది. అయితే దీనిపై బ్యాంకు ఉద్యోగులతో పాటు సోషల్ మీడియాలోనూ నిరసనలు వ్యక్తం కావడంతో వెంటనే ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. 'నవరాత్రి సెలబ్రేషన్ అండ్ డ్రెస్ కోడ్' అనే టైటిల్‌తో ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సెంట్రల్ కార్యాలయం డిజిటల్ విభాగం జనరల్ మేనేజర్ ఏఆర్ రాఘవేంద్ర ఈ సర్క్యులర్ జారీ చేశారు. నవరాత్రి సందర్భంగా అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకూ సిబ్బంది డ్రెస్‌కోడ్ పాటించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. రూల్స్ పాటించని పక్షంలో రూ.200 జరిమానా ఉంటుందన్నారు. అక్టోబర్ 1న ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.


సర్క్యులర్ ప్రకారం, ఉద్యోగులంతా ప్రతిరోజూ గ్రూప్ ఫోటోలు దిగడం తప్పనిసరి. ఉత్సవాల రోజుల్లో క్రమపద్ధతిలో పసుపు, ఆకుపచ్చ, ఆరెంజ్, తెలుపు, రాయల్ బ్లూ, పింక్, పర్పుల్, గ్రే, ఎరుపు రంగు దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. చెక్స్ షర్టులు, బెస్ కలర్ పరిశీలిస్తామని తెలిపింది. కాగా, యూబీఐ సర్క్యులర్‌పై ఎంప్లాయీస్ ఫెడరేషన్ అభ్యంతరం తెలిపింది. డ్రస్‌కోడ్, పెనాల్టీ వేయడం డిజిటలైజేషన్ డిపార్ట్మెంట్ అఫీషియర్ మేటర్ కాదంటూ తప్పుపట్టింది. సెక్యులరిజం స్ఫూర్తికి ఇది విఘాతమని పేర్కొంది. ఇది మతపరమైన ఉత్సవమని, ప్రైవేటుగా ఉత్సవాలు జరుపుకోవాలే కానీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లో అధికారికంగా జరుపుకోవడం తగదంటూ యూబీఐకి రాసిన లేఖలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పేర్కొంది. బ్యాంకు వందేళ్ల చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని తెలిపింది. సోషల్ మీడియాలోనూ ఇదే తరహా విమర్శలు వచ్చాయి. దీంతో యూబీఐ సెంట్రల్ బ్యాంక్ వెనక్కి తగ్గుతూ ఆ సర్క్యులర్‌ను రద్దు చేసింది.

Updated Date - 2021-10-11T00:15:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising