ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు థెరపీలూ సురక్షితమే

ABN, First Publish Date - 2021-08-04T13:55:46+05:30

గుండె మార్పిడి లేదా ఎల్‌వీఏడీ ఇంప్లాంట్‌.. రెండు థెరపీలూ సురక్షితమైనవేనని, మూత్రపిండాలు లేదా లివర్‌ మార్పిడి తరువాత ఎలా జీవిస్తున్నారో అలాగే ఈ థెరపీ తరువాత కూడా సాధారణ జీవితం కొ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                 - కార్డియాలజిస్టు రవికుమార్‌


చెన్నై: గుండె మార్పిడి లేదా ఎల్‌వీఏడీ ఇంప్లాంట్‌.. రెండు థెరపీలూ సురక్షితమైనవేనని, మూత్రపిండాలు లేదా లివర్‌ మార్పిడి తరువాత ఎలా జీవిస్తున్నారో అలాగే ఈ థెరపీ తరువాత కూడా సాధారణ జీవితం కొనసాగించవచ్చని ఎంజీఎంకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌.రవికుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. మందులు పని చేయనప్పుడు గుండె సరిగ్గా పనిచేసేందుకు గుండె మార్పిడి, గుండె సహాయ పంపులు, ఎల్‌వీ సహాయక పరికరాల అమరిక మాత్రమే చికిత్స అని వివరించారు. నిరంతరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా ఉండడం, ఎకో స్కాన్‌లో ఈఎఫ్‌ 30 శాతం కంటే తక్కువగా వున్నప్పుడు, కాళ్లలో ఎల్లప్పుడూ వాపు లేదా ఎల్లప్పుడూ అలసటగా ఉండడం వంటి సందర్భాలలో గుండె మార్పిడి లేదా ఎల్‌వీఏడీ అవసరం కావచ్చన్నారు. రోగికి విజయవంతంగా గుండెమార్పిడి లేదా ఎల్‌వీఏడీ అయిన తరువాత.. సాధారణ చురుకైన జీవితాన్ని గడుపుతాడన్నారు. అయితే తమలాంటి అనుభవజ్ఞులైన వైద్యులు, మంచి ఫలితాలను సాధిం చిన వైద్యకేంద్రాలను మాత్రమే రోగి ఎంచుకోవాలని డాక్టర్‌ రవికుమార్‌ సూచించారు. 

Updated Date - 2021-08-04T13:55:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising