ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాగ్దాద్‌లో అమెరికన్ ఎంబసీ టార్గెట్‌గా రెండు రాకెట్లు

ABN, First Publish Date - 2021-12-19T16:57:12+05:30

ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్‌లో అత్యంత కట్టుదిట్టమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాగ్దాద్ : ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ఆదివారం రెండు రాకెట్లు దూసుకొచ్చాయి. ఈ ప్రాంతంలోని అమెరికన్ ఎంబసీ లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు భద్రతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 


ఇరాక్ భద్రతా దళాలు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం,  బాగ్దాద్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ఆదివారం రెండు రాకెట్లు దూసుకొచ్చాయి. గ్రీన్ జోన్‌లో ఉన్న అమెరికన్ ఎంబసీ లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఇవి కట్యూషా రాకెట్లు. మొదట వచ్చిన రాకెట్‌ను C-RAM డిఫెన్స్ బ్యాటరీలు ఆకాశంలో ఉండగానే కూల్చేశాయి. ఇది అమెరికన్ ఎంబసీకి సమీపంలో పడింది. రెండోది ఓ స్క్వేర్‌లో పడటంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. 


ఈ రాకెట్లను ఎవరు ప్రయోగించారో ఇంకా తెలియలేదు. దీనికి తమదే బాధ్యత అని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదు. ఇదిలావుండగా, అమెరికన్ దళాలు, ఆస్తులపై రాకెట్, డ్రోన్ దాడులు ఇటీవల పెరుగుతున్నాయి. ఇరాన్ అనుకూల వర్గాలే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ దళాలు ఇరాక్‌ నుంచి  పూర్తిగా వెళ్ళిపోవాలని ఇరాన్ అనుకూల గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి. 


Updated Date - 2021-12-19T16:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising