ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ జడ్జీలు

ABN, First Publish Date - 2021-03-02T00:51:34+05:30

అయితే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన చితంబరేష్‌.. ప్రత్యక్ష చేరికలో లేరు. ఢిల్లీలో ఉన్న ఆయన.. అక్కడి నుంచే సభ్యత్వం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లో అఖిల భారతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళకు చెందిన ఇద్దరు మాజీ జడ్జీలు భారతీయ జనతా పార్టీలో చేరారు. కేరళ హైకోర్టులో జడ్జీలుగా పని చేసిన పీఎన్ రవీంద్రన్, వి చితంబరేష్‌లు మరో 18 మందితో కలిసి ఆదివారం కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేరళలోని ఎర్నాకులంలో కొనసాగుతున్న విజయయాత్ర ఇందుకు వేదికైంది. ఈ ఇద్దరు జడ్జీలతో పాటు మాజీ DGP వేణుగోపాల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ జనరల్ మేనేజర్ సోమచూదన్, మిలిటరీ మాజీ అధికారి (రేర్ అడ్మిరల్) బీఆర్ మీనన్‌లతో సహా మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరారు.


అయితే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన చితంబరేష్‌.. ప్రత్యక్ష చేరికలో లేరు. ఢిల్లీలో ఉన్న ఆయన.. అక్కడి నుంచే సభ్యత్వం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. పలక్కడ్‌లోని విక్టోరియా కాలేజీలో బీజేపీకి చాలా కాలం మద్దతుదారుగా ఉన్నట్లు వెల్లడించారు. బీజీపీలో చేరిన ఇద్దరు జడ్జీలు.. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చిన ‘లవ్ జిహాదీ’ బిల్లుకు మద్దతిచ్చారు.

Updated Date - 2021-03-02T00:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising