ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు జిల్లాలకు భారీ వర్ష సూచన

ABN, First Publish Date - 2021-06-18T14:02:58+05:30

నీలగిరి, కోయంబత్తూర్‌ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. స్థానిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ప్యారీస్‌(చెన్నై): నీలగిరి, కోయంబత్తూర్‌ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. స్థానిక నుంగంబాక్కం కాలేజీ రోడ్డులో ఉన్న భారత వాతావరణ పరిశోధన కేంద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా రాష్ట్రం వైపు బలమైన గాలులు వీస్తున్నాయని, మరోవైపు నైరుతి రుతుపవనాల కారణంగా కొండలు, అడవులు అధికంగా ఉన్న కోయంబత్తూర్‌, నీలగిరి జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాలు తిరుప్పూర్‌, దిండుగల్‌, తేని, తెన్‌కాశి, కన్నియకుమారి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని, సేలం, ఈరోడ్‌, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, చెన్నైలో ఆకాశం మేఘావృతంగా వుంటూ సాయంత్రం, రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశముందని వారు వివరించారు.

Updated Date - 2021-06-18T14:02:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising